ట్రంప్- మస్క్ బంధం చెడింది! ‘బ్రొమాన్స్’ ముగిసింది!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజ్యాధినేతకు, బడా బిలియనీర్‌కు మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన బ్రొమాన్స్ ఇక ముగిసిపోయింది. అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి ఎలాన్ మస్క్. అమెరికాలో ఎంతో మంది బిలియనీర్లు, టెక్ జెయింట్లు ఉన్నా.. కేవలం మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్‌ను బహిరంగంగా సపోర్ట్ చేస్తూ.. డెమోక్రటిక్ పార్టీని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ట్రంప్ ఎక్కడకు వెళ్తే.. అక్కడకు వెంట వెళ్లాడు…

Read More

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ సిగ్గుపడాల్సిన విషయం! ఏపీకి ఇలా, కర్ణాటకలో అలా!

వైజాగ్ స్టీల్ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అతలాకుతలం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరితీసే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో కర్ణాటకలో అందుకు భిన్నంగా సాగుతోంది. భద్రావతిలో ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు పెద్దమొత్తంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా 15వేల కోట్ల…

Read More

ఇళయరాజాకి కులవివక్ష, గర్భగుడి ప్రవేశాన్ని అడ్డుకున్న అర్చకులు, జీయర్లు

దేశంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి చుక్కెదురయ్యింది. ఆయన ఆలయంలో అడుగుపెట్టే ప్రయత్నానికి అభ్యంతరం వ్యక్తమయ్యింది. గర్భగుడిలో ఆయన ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో ఇళయరాజా నిరాశ చెందాల్సి వచ్చింది. గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా ‘గర్బగుడిలోకి మీకు లోపలికి ప్రవేశం లేదని’ పూజారులు, జీయర్లు వెనక్కి పంపించేశారు. తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గర్భుగడిలో ప్రవేశించేందుకు చేసిన యత్నానికి స్థానిక పూజార్లు, ఆలయ అర్చకులు అంగీకరించకపోవడం వివాదంగా మారుతోంది. ఇళయరాజా…

Read More

రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉండడానికి కారణమదేనా, టాలీవుడ్ ఆశించింది జరిగేనా?

ఆకు వెళ్లి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి ఆకు మీద పడినా నష్టపోయేది ఆకు అన్నది నానుడి. సరిగ్గా టాలీవుడ్ కి ఇది వర్తించేలా కనిపిస్తోంది. పాలకపక్ష నేతకు కోపం వచ్చినా టాలీవుడ్ కే నష్టం. టాలీవుడ్ సెలబ్రిటీలకు ఆగ్రహం కలిగినా వాళ్లే నష్టపోతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్- రేవంత్ రెడ్డి ఉదంతం అందుకు సాక్ష్యంగా ఉంది. తాజాగా టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశం అందుకు కొనసాగింపుగానే కనిపిస్తోంది. ప్రభుత్వాలకు…

Read More

హుందాగా అల్లు అర్జున్, విడుదల తర్వాత పెదవి విప్పిన ఐకాన్ స్టార్

పుష్ప2 ద్వారా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన అల్లు అర్జున్ అనుకోని కష్టాల్లో ఏకంగా జైలు పాలుకావడం సంచలనంగా మారింది. చివరకు ఒకరోజు జైలులో గడిపిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. తొలుత భార్య బిడ్డల దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్ అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన హుందాగా వ్యవహరించడం ఆకట్టుకుంది. “చట్టాన్ని…

Read More

విరాట్ కోహ్లీ, బాబర్ అజామ్ కలిసి ఒకే టీమ్ కి ఆడబోతున్నారు..!

అవును.. నిజమే. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడబోతున్నారు. ఛాంపియన్స్ ట్రోపీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకే బీసీసీఐ సిద్ధంగా లేని దశలో పాకిస్తాన్ ప్లేయర్ తో కలిపి టీమిండియా ఆటగాడు ఆడడం ఏమిటనుకుంటున్నారా.. అదే జరగబోతోంది. ఇద్దరూ కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోబోతున్నారు. ఈ ఇద్దరే కాదు.. పాకిస్తాన్, టీమిండియా నుంచి మరికొందరు ప్లేయర్లు కూడా ఆ టీమ్ లో ఉంటారు.. ఆఫ్రో ఆసియన్ కప్ మరోసారి నిర్వహించాలని ఆఫ్రికా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించడంతో…

Read More

సిబిల్ స్కోర్ వ్యవస్థకు చెక్ పడుతుందా? సామాన్యులకు ఊరట దక్కుతుందా?

బ్యాంక్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్, ఏదయినా ఫైనాన్స్ వ్యవహారం చక్కదిద్దాలంటే సిబిల్ స్కోర్. ఇలా ప్రతీదానికి సిబిల్ స్కోర్ తో ముడిపెట్టి చాలామందిని వేధిస్తున్న పరిస్థితి కొంతకాలంగా తీవ్రమవుతోంది. సిబిల్ స్కోర్ పడిపోతుందన్న ఆందోళనతో సతమతమయ్యే మధ్యతరగతి సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ వ్యవహారం మీద తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా సిబిల్ స్కోర్ విషయమై వివాదం ఏకంగా సుప్రీంకోర్టుకి చేరింది. ఈ విధానం వల్ల ఈ దేశ బ్యాంకు అకౌంట్ హోల్డర్ల వ్యక్తిగత గోప్యతకు…

Read More

విశాఖలో ఆరుగురు అమ్మాయిలు మాయం, కళ్లలో కారం జల్లిపారిపోయారని ఫిర్యాదు

విశాఖ జిల్లాలో ఒకేరోజు ఆరుగురు అమ్మాయిలు పరారయ్యారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్వధార్ హోం నుంచి వారంతా పారిపోయారు. దాంతో ఈ ఘటన సంచలనంగా మారింది. పెందుర్తి మండలంలోని స్వధార్ గృహం నుంచి ఆరుగురు బాధిత యువతులు పారిపోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. వారంతా వివిధ కేసుల్లో న్యాయస్థానం నుంచి ఆదేశాల మేరకు స్వధార్ లో ఉంటున్నారు. వారికి తగిన సెక్యూరిటీ లేకపోవడంతో ఏకంగా నిర్వాహకులను కత్తితో బెదిరించి అక్కడి నుంచి పరారయినట్టు పోలీసులకు…

Read More

ఆడబిడ్డల భద్రతే మొదటి ప్రాధాన్యం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు,వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా…

Read More